సంధ్యా కాంతులు ఆకాశం లో మబ్బులతో కలసి తమకు తోచిన చిత్రాలు చేస్తున్నాయి. నేను తనకోసం ఎదురు చూస్తున్నాను………… ఎగిరి వచ్చిన ఒక పక్షితో తనకు రాయబారం పంపాను…... అంతలో ఆకాశం రేరాణి రాకకై నీలం తివాచీ పరిచింది. కోటి తారల మెరుపులు స్వాగతించగా తను తరలి వచ్చింది ……నా నిశి…
అలసి వున్న మనసును తన వెన్నెల స్పర్శ తో ఆదరంగా పలకరించింది..తన చల్లని ఒడిలో నేను ఆదమరచి నిదురించాను. కలల లోకం లో విహరించాను…
ఇరుల తెరలు తొలగి తెల్లవారింది జీవనం పయనం కోసం తయ్యార్ అంది….నన్ను వదలిపోతావా అని నిశి అలిగింది…మరి నిన్నటి స్వప్నం నిజం కావాలి కదా అన్నాను……నాతో నే వుంటే నక్షత్రాలన్నీ నీవే అంది, ఉషా కిరణాలు సోకి మంచు బిందువులు మెరిశాయి……..నీ పగటి ప్రయాణం లో వెండి వెన్నెల కానరాదంది, కొలనులో తెల్ల కలువలు విరిశాయి. నిన్ను విడచి నేనుండలేనంది……. నీడ గా మారి తోడుగా వచ్చింది….. స్వప్నాన్ని సాకారం చేసుకొనే నా పయనం లో……..